ఆర్ఆర్ఆర్ టీం నుండి ఆగ‌స్ట్ 15న స‌ర్‌ప్రైజ్..!

Tue,August 13, 2019 01:08 PM
rrr first look comes on august15

రాజ‌మౌళి సినిమాలంటే జ‌నాల‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న తెర‌కెక్కించే విధాన‌మే కాదు సినిమాల‌ని ప్ర‌మోట్ చేసుకునే విధానంకి కూడా ప్ర‌త్యేక శైలి ఉంటుంది. బాహుబ‌లి సినిమాని సరికొత్త పంథాలో ప్ర‌మోట్ చేసుకున్న రాజ‌మౌళి ఈ సినిమాకి భారీ మార్కెట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం కొత్త ఆలోచ‌న‌లు చేస్తున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర పోషిస్తుండ‌గా, చ‌ర‌ణ్ .. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. వారి లుక్స్ ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి జ‌నాల‌లో ఉంది. ఆ మ‌ధ్య ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అయిన చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తారేమోన‌ని అభిమానులు భావించిన‌ప్ప‌టికి అది కుద‌ర‌లేదు. అయితే చిత్రం చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో రూపొందుతుంది కాబ‌ట్టి మూవీ ఫ‌స్ట్ లుక్‌ని స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ సారైన రాజ‌మౌళి అభిమానుల ఆశ‌లు ఆవిరి చేయ‌కుండా ఉంటాడా, లేదా అనేది చూడాలి. అలియా భ‌ట్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

1937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles