సుకుమార్ చిత్రంలో ప‌ల్లెటూరి భామ‌గా ర‌ష్మిక‌..!

Wed,September 18, 2019 12:21 PM

లెక్క‌ల మాస్టారు సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రాల‌లో ఏదో ఒక ప్ర‌త్యేకత ఉంటుంది. గ‌త ఏడాది ప‌ల్లెటూరి నేప‌థ్యంలో రంగ‌స్థ‌లం అనే చిత్రాన్ని తెరకెక్కించి భారీ విజ‌యాన్ని అందుకున్నాడు. ఇందులో రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత ప‌ల్లెకి చెందిన వ్య‌క్తులుగా క‌నిపించి అల‌రించారు. ఇక త్వ‌ర‌లో అల్లు అర్జున్ హీరోగా క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. శేషచలం అటవీ నేపథ్యంలో గంధపు అక్రమ రవాణాకి సంబంధించి ఈ సినిమా ఉంటుంద‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇందులో ర‌ష్మిక ప‌ల్లెటూరి భామ‌గా క‌నిపించ‌నుందట‌. చిత్రంలో ర‌ష్మిక పాత్ర‌కి మంచి అప్లాజ్ వ‌స్తుంద‌ని అంటున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. బ‌న్నీ ప్ర‌స్తుతం అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ చిత్రం త‌ర్వాత సుకుమార్ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ర‌ష్మిక స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం విదిత‌మే.

2235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles