అల‌..వైకుంఠ‌పుర‌ములో ‘రాములో రాములా’ టీజర్

Tue,October 22, 2019 04:27 PM

అల్లు అర్జున్-త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో వస్తోన్న చిత్రం ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’. ఈ మూవీ నుంచి రాములో రాములా నన్నాగమ్ చేసిందిరో అంటూ సాగే పాట టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో అల్లు అర్జున్, పూజాహెగ్డే కలిసి వేసే స్టెప్పులను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. రాములో రాములా పాటను కాసర్ల శ్యామ్ రాయగా..అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది.


ఇప్పటికే విడుదలైన సామజవరగమన పాట సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ ను సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

1576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles