నేను క్షేమంగా ఉన్నాను: రాజ‌శేఖ‌ర్

Wed,November 13, 2019 10:04 AM

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ కారు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా స్పందించారు రాజ‌శేఖ‌ర్. మంగ‌ళ‌వారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుండి ఇంటికి వ‌స్తుండ‌గా ఔట‌ర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్ష‌న్ వ‌ద్ద నా కారు ప్ర‌మాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్క‌డినే ఉన్నాను. ఎదురుగా వ‌స్తున్న కారులో వారు ఆగి, నా కారు ద‌గ్గ‌ర‌కి వ‌చ్చారు. లోప‌ల ఉన్నది నేనే అని గుర్తు ప‌ట్టి, విన్ షీల్డ్‌లో నుండి బ‌య‌ట‌కి లాగారు. అప్పుడు నేను వెంట‌నే వారి ఫోన్ తీసుకొని మొద‌ట పోలీసుల‌కి, త‌ర్వాత నా కుటుంబ స‌భ్యుల‌కి స‌మాచారం అందించాను. అక్క‌డ నుండి వారి కారులో ఇంటికి బ‌య‌లుదేరాను. జీవిత‌, మా కుటుంబ స‌భ్యులు, ఎదురు వ‌చ్చి న‌న్ను పిక‌ప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు. ప్ర‌స్తుతం క్షేమంగా ఉన్నాను అని రాజ‌శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ పతాకంపై జి. ధనుంజయన్‌ నిర్మిస్తున్న సినిమాలో రాజశేఖర్‌ నటిస్తున్నారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకుడు.

6356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles