ఫుల్ ఫ‌న్ అండ్ సెంటిమెంట్‌తో ప్ర‌తిరోజూ పండ‌గే- ట్రైల‌ర్

Thu,December 5, 2019 08:05 AM

మెగా హీరో సాయిధ‌ర‌మ్, ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో మారుతి తెర‌కెక్కించిన చిత్రం ప్ర‌తి రోజూ పండ‌గే. డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానున్న చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని క‌లిగిస్తున్నాయి. కుటుంబ పెద్ద పాత్ర‌లో, క్యాన్స‌ర్ ఫైన‌ల్ స్టేజ్‌ ఉన్న వ్య‌క్తి పాత్ర‌ని పోషించారు స‌త్య‌రాజ్. ఇక ఆయ‌న క‌న్న కల‌ల‌ని సాకారం చేసే పాత్ర‌లో సాయిధ‌ర‌మ్ న‌టించారు. తేజూ తండ్రిగా రావు ర‌మేష్ అల‌రించ‌నున్నారు. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించ‌డం ఖాయం అని ట్రైల‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రు అంటున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. థ‌మ‌న్ సంగీతం కూడా సినిమాకి ప్ల‌స్ కావ‌డంతో ఈ మూవీ మంచి హిట్ అనే అంటున్నారు సినీ ల‌వ‌ర్స్.

685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles