కృష్ణ‌వంశీకి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌కాశ్ రాజ్‌..!

Sat,December 14, 2019 10:51 AM

విల‌క్ష‌ణ న‌టుడిగా ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన ప్ర‌కాశ్ రాజ్ అనేక భాష‌ల‌లో ప‌లు చిత్రాలు చేస్తూ బిజీ లైఫ్ గ‌డుపుతున్నారు . రాజ‌కీయాల‌లో కూడా అడ‌పాద‌డ‌పా త‌న సేవ‌లందిస్తూనే ఉన్నారు. అయితే ఇంత బిజీగా ఉన్న ప్ర‌కాశ్ రాజ్ ఇప్పుడు కృష్ణ వంశీ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా పని చేయ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా.. ఇక్క‌డే ఓ చిన్న ట్విస్ట్ ఉంది.


కృష్ణ వంశీ ప్ర‌స్తుతం ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రంగ‌మార్తాండ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బ్ర‌హ్మానందం గ‌తంలో ఎప్పుడు చేయ‌ని పాత్ర పోషిస్తున్నారు. రంగ‌స్థ‌ల న‌టులు ఇందులో భాగం కానున్నారు. అయ‌తే ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుండగా, సెట్‌కి సంబంధించిన ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి.

కృష్ణ‌వంశీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ సెట్‌లో ఫోటో ఫ్రేమ్‌ ఏర్పాటు చేస్తుండ‌గా, వారికి ప్ర‌కాశ్ రాజ్ సాయం చేసాడు. ఇది చూసిన కృష్ణ‌వంశీ వీడియో తీసి త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ .. `నా టీమ్‌లో కొత్త అసిస్టెంట్‌.. గాడ్ బ్లెస్‌ హిం` అంటూ కామెంట్ చేశాడు. రంగ‌మార్తాండ‌ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రకాష్‌ రాజ్‌, కేవలం నటుడిగా తన సీన్స్‌ పూర్తి చేసుకోని వెళ్లిపోవటం లేదు. సెట్‌లో అసిస్టెంట్‌లతో కలిసి ఇతర పనుల్లో సాయం చేస్తున్నాడు.


1289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles