త‌న ఆరోగ్యంపై వ‌స్తున్న పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చిన యాంక‌ర్ ప్ర‌దీప్

Sat,November 9, 2019 08:37 AM

బుల్లితెర‌పై వెరైటీ షోస్‌కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు. గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న టీవీలో క‌నిపించ‌డం లేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై అనేక వార్త‌లు వ‌చ్చాయి. ఏదో జ‌బ్బు వ‌ల‌న ఆయ‌న మొహం పూర్తిగా పాడైంద‌ని, ఇంకా షోస్‌లో క‌న‌ప‌డ‌డ‌ని కొంద‌రు అన్నారు. మ‌రి కొంద‌రు యాక్సిడెంట్ వ‌ల‌న రెస్ట్ తీసుకుంటున్నాడ‌ని ప్ర‌చారం చేశారు. ఇలాంటి పుకార్ల గురించి విని విసిగిపోయిన ప్ర‌దీప్ సోష‌ల్ మీడియా ద్వారా అస‌లు విష‌యం చెప్పాడు. నాకు అనారోగ్యం అని తెలిసి బాధపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. షూటింగ్ సమయంలో నా కాలికి చిన్న ఫ్రాక్చర్‌ అయ్యింది. ఎక్కువ సమయం నిల్చుని ఉండకూడదని డాక్టర్లు చెప్పడంతో విశ్రాంతి తీసుంటున్నా. షూటింగ్‌లను చాలా మిస్ అయ్యాను. నా కెరీర్‌లో ఇంత బ్రేక్ తీసుకోవడం ఇదే ప్రథమం. చాలా ఇబ్బందిగా అనిపించినా తప్పలేదు. ఒకటి రెండు వారాల్లో షూటింగ్‌ల్లో పాల్గొంటానని ప్రదీప్ వీడియోలో పేర్కొన్నాడు.

1916
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles