గ‌ల్లా అశోక్ మూవీకి క్లాప్ కొట్టిన రామ్ చ‌ర‌ణ్‌

Sun,November 10, 2019 12:58 PM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మేన‌ల్లుడు, గల్లా జ‌యదేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ డెబ్యూ మూవీ కొద్ది సేప‌టి క్రితం ఘ‌నంగా లాంచ్ అయింది. రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి రామ్ చ‌ర‌ణ్‌,రానా ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. వీరితో పాటు మంజుల‌, సుధీర్ బాబు, గ‌ల్లా జ‌య‌దేవ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. హీరో హీరోయిన్స్ మ‌ధ్య రామ్ చ‌ర‌ణ్ క్లాప్ కొట్టారు. చిత్ర బృందానికి ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రాన్ని దేవ‌దాస్ ఫేం శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందించ‌నున్నారు. ప‌ద్మావ‌తి గ‌ల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంక‌ర్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌.. అశోక్ స‌ర‌స‌న న‌టిస్తుంది.


2033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles