ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా, ప్ర‌మాదం జ‌రిగింది

Sat,November 16, 2019 10:59 AM

అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ జీవితం ఆధారంగా సైనా అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణితీ చోప్రా లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా కోసం ప‌రిణితీ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తుంది. టైం దొరికిన‌ప్పుడ‌ల్లా కోర్టులో చెమ‌ట‌లు క‌క్కుతూ ప్రాక్టీస్ చేసింది. అయితే తాజాగా ఆమె షూటింగ్‌లో గాయ‌ప‌డింద‌ట‌. ఆ విష‌యాన్ని త‌న పోస్ట్ చేస్తూ తెలిపింది. డ్యూడ్స్‌.. సైనా షూటింగ్ స‌మ‌యంలో గాయ‌పడ‌కుండా నేను, చిత్రబృందం ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా..అనుకున్న‌ది జ‌రిగింది. త‌గిన విశ్రాంతి త‌ర్వాత మ‌ళ్ళీ బ్యాడ్మింటన్ ఆడేందుకు సిద్ద‌మ‌వుతాను అంటూ త‌న పోస్ట్‌లో పేర్కొంది.


అమోల్ గుప్తే తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ముందుగా బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ని ముందుగా టైటిల్ రోల్‌కి ఎంపిక చేసారు. సైనా పాత్ర కోసం శ్ర‌ద్ధా క‌పూర్ కొన్ని నెల‌ల పాటు శిక్షణ పొందిన సంగ‌తి తెలిసిందే. అయితే శ్రద్దాకి సడన్ గా డెంగీ సోకడం, కోలుకున్న తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ కావడంతో శ్రద్దా స్థానంలో ప‌రిణితీ చోప్రాని ఎంపిక చేసారు.


13293
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles