ఓ బావా సాంగ్ ప్రోమో విడుద‌ల‌

Sat,November 16, 2019 10:29 AM

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, అందాల భామ రాఖి ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న‌ చిత్రం ప్రతి రోజు పండగే. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ రీసెంట్‌గా పూర్తైంది. వీలైనంత త్వ‌ర‌గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని పూర్తి చేసి డిసెంబ‌ర్ 20న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుద‌ల చేస్తున్నారు. టైటిల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రాగా, రీసెంట్‌గా ఓ బావా అనే సాంగ్ ప్రోమో విడుద‌ల చేశారు. ఫుల్ సాంగ్ నవంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు .

1443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles