తొలి పాట‌తో వైబ్స్ క్రియేట్ చేస్తున్న డిస్కోరాజా టీం

Sun,October 20, 2019 09:18 AM

ర‌వితేజ‌- వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం డిస్కోరాజా. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి తొలి సాంగ్ విడుద‌లైంది. ‘నువ్వు నాతో ఏమన్నావో.. నేనేం విన్నానో..బదులేదో ఏం చెప్పావో.. ఏమనుకున్నానో.. భాషంటూలేని భావాలేవో.. నీ చూపులో చదవనా..’ అంటూ సాగే ఈ పాట వైబ్స్ క్రియేట్ చేస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం , గాన గాంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం ఆలాప‌న‌, ఎస్. ఎస్. థమన్ వినసొంపైన సంగీతం సంగీత ప్రియుల‌ని వేరే లోకానికి తీసుకెళుతుంది. ప్ర‌స్తుతం ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. క్రిస్మ‌స్ కానుక‌గా చిత్రం విడుద‌ల‌వుతుంద‌ని తెలుస్తుంది. చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles