నితిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా ?

Tue,January 14, 2020 08:18 AM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న 36 ఏళ్ళ నితిన్ పెళ్లికి సంబంధించి ఇటీవ‌ల ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. నితిన్ ప్రేమ వివాహం చేసుకోనున్నాడ‌ని, డెస్టినేష‌న్ వెడ్డింగ్ వేడుక‌గా నితిన్ వివాహం ఉంటుంద‌ని ప్ర‌చారం చేశారు. అయితే తాజాగా నితిన్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఫిలిం న‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో నితిన్ వివాహం చేసుకోనున్నాడ‌ని అంటున్నారు. 14,15 తేదీల‌లో ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌గ‌నున్న‌ట్టు టాక్. కేవ‌లం 500 మందిని మాత్ర‌మే పెళ్లికి ఆహ్వానించాల‌ని నితిన్ కుటుంబ స‌భ్యులు భావిస్తున్నార‌ట‌. అయితే నితిన్ చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని కాగా, ఆమె లండ‌న్‌లో ఎంబీఏ చేసింద‌ట‌. నాలుగేళ్లుగా ప్రేమ‌లో ఉన్న వీరిరివురు పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి పీటలెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. చూడాలి మ‌రి ఈ వార్త‌పై నితిన్ ఏమైన స్పందిస్తాడా అనేది.

4762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles