ఒకే వీడియోని 28,763 సార్లు వీక్షించిన నెటిజన్

Tue,January 14, 2020 07:52 AM

యూట్యూబ్‌లో ఏదైన వీడియో బాగా న‌చ్చితే ఒక వంద సార్లు చూస్తాం. ఇంకా బాగా నచ్చితే 500 సార్లు చూస్తామనుకోండి. కాని ఓ నెటిజ‌న్ ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్‌ తెరకెక్కిస్తున్న బ్లాక్‌ విడో సినిమా టీజర్‌ను 28,763 సార్లు వీక్షించాడ‌ట‌. అయితే మ‌రోసారి చూడాల‌ని భావించిన నెటిజ‌న్‌కి నిరాశ ఎదురైంది. ఇప్ప‌టికే మీరు 28,763 సార్లు ఈ వీడియోను చూసినందున.. మరోసారి దానిని ప్రదర్శించలేకపోతున్నామని యూ ట్యూబ్ నెటిజ‌న్‌కి హెచ్చ‌రిక జారీ చేసింది. దీంతో చేసేదేం లేక నెటిజ‌న్ మ‌ళ్ళీ ఆ వీడియో చూసే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అయితే ఈ విష‌యాన్ని మార్వెల్ త‌న ఫేస్ బుక్‌లో స్క్రీన్ షాట్ తీసి పెట్ట‌డం విశేషం.

1622
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles