ప్రియుడి నిర్మాణంలో న‌య‌న‌తార చిత్రం

Sun,September 15, 2019 12:16 PM

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌నతార ఇటు తెలుగు, అటు త‌మిళంలో వ‌రుస సినిమాల‌తో ప‌ల‌కరిస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌య‌న్ న‌టించిన సైరా చిత్రం ద‌స‌రా కానుకగా విడుద‌ల కానుండ‌గా, ఆమె ప్ర‌స్తుతం త‌న 65వ చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని త‌న ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ నిర్మిస్తుండ‌గా, మిలింద్ ర‌వ్ తెర‌కెక్కిస్తున్నాడు. థ్రిల్ల‌ర్‌తో పాటు ఆస‌క్తిక‌రంగా ఉండ‌నున్న ఈ చిత్రానికి నెట్రిక‌న్న్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. పోస్ట‌ర్‌లో టైటిల్ బ్రెయిలీ లిపీతో రూపొందించిన‌ట్టుగా ఉంది. చిత్రంలో న‌య‌న‌తార అంధురాలిగా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. చిత్రానికి సంబంధించిన పూర్తి డీటైల్స్ అతి త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. ఈ చిత్రంతో విఘ్నేష్ శివ‌న్ నిర్మాత‌గా మారుతున్నాడు. కాగా న‌య‌న తార త‌మిళంలో ర‌జ‌నీకాంత్ ద‌ర్భార్, విజ‌య్ బిగిల్ చిత్రాల‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది న‌య‌న్, విఘ్నేష్ శివ‌న్ పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది.1773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles