బుధవారం (నవంబర్ 20) రోజు టాలీవుడ్ నిర్మాతలు, హీరోలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడి జరిపిన సంగతి తెలిసిందే. ముందుగా నిర్మాత సురేష్ బాబు ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ దాడులు జరగగా, ఆ తర్వాత వెంకటేష్, నాని ఇల్లు, ఆఫీసులలోను దాడులు నిర్వహించారు. వరుస దాడులతో టాలీవుడ్, నిర్మాతలలో కంగారు మొదలైంది. అయితే దీనిపై యంగ్ హీరో నవదీప్ దీనిపై ఫన్నీ ట్వీట్ చేశారు. ఇన్‌కంట్యాక్స్ అధికారులు నా మీద దాడి చేసి ఉంటే, వాళ్ళే కొంత మనీని నా దగ్గర వదిలేసి వెళ్ళేవారు అనే కామెంట్ పెట్టారు. దీంతో పాటు బిల్ బ్యాండ్ బాజా అనే హ్యాష్ ట్యాగ్ కూడా తన కామెంట్‌కి జతచేశాడు నవదీప్. ప్రస్తుతం ఈ హీరో అల.. వైకుంఠపురములో కీలక పాత్ర పోషిస్తున్నాడు