డిసెంబ‌ర్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్ మొద‌లు పెట్ట‌నున్న నాని

Sun,September 15, 2019 10:21 AM

నేచుర‌ల్ స్టార్ నాని రీసెంట్‌గా గ్యాంగ్ లీడ‌ర్ అనే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఇందులో ప్రియాంక ,లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 5 కోట్ల‌కి పైగా గ్రాస్ వ‌సూళ్ళు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం గ్యాంగ్ లీడ‌ర్ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న నాని వ‌చ్చే వారం బ్యాంకాక్‌కి వెళ్ళ‌నున్నాడు. అక్క‌డ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వీ అనే చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, ఆ టీంతో జాయిన్ కానున్నాడు. ఇక డిసెంబ‌ర్‌లో శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రం కోసం ప‌ని చేయ‌నున్నాడు. మ‌జిలీ చిత్ర నిర్మాత‌లు సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది చిత్రాన్ని నిర్మించ‌నుండ‌గా, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల‌లో వెల్ల‌డించనున్నారు

1152
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles