స్టార్ హీరో సినిమాల‌కి పోటీగా నంద‌మూరి హీరో చిత్రం

Fri,November 8, 2019 11:13 AM

సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు థియేట‌ర్స్‌లోకి రావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి మ‌హేష్ న‌టిస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో పాటు అల్లు అర్జున్ న‌టిస్తున్న అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రాలు విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మ‌య్యాయి. వీటితో పాటు ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న ద‌ర్భార్ కూడా సంక్రాంతి బ‌రిలో నిలుస్తుంది. అంతేకాదు వెంకీ, నాగ‌చైత‌న్య మ‌ల్టీ స్టార‌ర్ వెంకీమామ కూడా సంక్రాతికి విడుద‌ల‌య్యేందుకు సిద్ద‌మైంది. అయితే ఈ సినిమాల‌కి పోటీగా నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం ఎంత మంచి వాడ‌వురా కూడా సంక్రాంతికి థియేట‌ర్స్‌లోకి వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. తాజాగా చిత్ర రిలీజ్‌పై అఫీషియ‌ల్ ప్ర‌ట‌క‌న చేశారు మేక‌ర్స్. జ‌న‌వ‌రి 15,2020న చిత్రాన్ని విడుదల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.


క‌ళ్యాణ్ రామ్ త‌న 17వ చిత్రాన్ని స‌తీష్ వేగేష్న ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఎంత మంచివాడ‌వురా అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంది. ఈ చిత్రంలో మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంతో నిర్మాణ‌రంగంలోకి అడుగుపెడుతుంది . గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుజ‌రాతీ హిట్ చిత్రం ఆక్సీజ‌న్‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంద‌ట‌. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, ఫీల్‌ను మిస్‌ చేయకుండా చాలా చ‌క్క‌గా స‌తీష్ వేగ‌శ్న తెర‌కెక్కిస్తున్నాడని అంటున్నారు.

1338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles