‘హేజా’ సినిమాకు అన్నీ ఆయనే..

Fri,September 6, 2019 07:20 AM
munnakaasi is allrounder to Heza movie


చిత్రసీమలో ఓ యువ కెరటం వైవిధ్య పాత్రలతో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఎన్నో అంశాల మేళవింపు ఉంటే తప్ప నిర్మాణం రూపుదాల్చుకోవడం కష్టమైన సినిమాకు.. అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నాడు. తెర వెనుక, తెర ముందూ అత్యంత క్లిష్టమైన వేర్వేరు బాధ్యతలను నిర్వర్తిస్తూనే..మరో వైపు చిత్ర కథానాయకుడి పాత్రను విజయవంతంగా పోషిస్తున్నాడు. చిత్ర సీమలో గతంలోనూ కొందరు ప్రముఖ దర్శకులు , కథానాయకులు తెరవెనుక, తెర ముందూ ద్వి, త్రిపాత్రాభినయనాలు చేసినప్పటికీ...ఈ వర్థమాన యువ కథనాయకుడు ఏకంగా ఏడు పాత్రలను తానొక్కడే పోషిస్తూ తాను తొలిసారిగా నిర్మిస్తున్న ‘హేజా’ చిత్రాన్ని చరిత్రాత్మకం చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

విశాఖ పట్టణానికి చెందిన కాశీ వెంకట సూర్యనారాయణ మూర్తి(మున్నా కాశీ) గత కొద్ది సంవత్సరాలుగా నగరంలో ఉంటూ చిత్ర సీమకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సేవలను అందిస్తున్నాడు. 10 సంవత్సరాల తన సంగీత దర్శకత్వ అనుభవంతో...ప్రముఖ నిర్మాణ దారులు, నటుల ప్రోత్సాహంతో తొలిసారిగా తానే కథా రచయితగా.. కథానాయకుడిగా..చిత్ర దర్శకుడిగా..నిర్మాణ దారుడిగా..మాటలు పాటల రచయితగా...సంగీత దర్శకుడిగా ‘హేజా’ అనే చిత్రాన్ని స్వయంగా రూపొందిస్తున్నాడు. మ్యూజికల్‌ హర్రర్‌గా నామకరణం చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ను ముగించుకుని.. సాంకేతిక సొబగులు అద్దుకుంటున్నది. అతి త్వరలో విభిన్నత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

‘బిచ్చగాడే’ స్ఫూర్తి


చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉన్న మున్నా కాశీ..మ్యూజిక్‌లో ప్రావీణ్యం సాధించాడు. ‘మిస్టర్‌ 7’ సినిమాకు తొలిసారిగా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పని చేసిన మున్నా..ఆ తర్వాత ప్రముఖుల మన్ననలు పొంది పలు సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సేవలందించాడు. రచయితగా రాణిస్తున్న మున్నా..తనకు సరిపోయే ఓ కథను స్వయంగా రాసుకున్నాడు. ఆ కథను తెరకెక్కించేందుకు ఆయా విభాగాల ప్రముఖుల దగ్గరకు వెళ్లినా..అనుకున్న స్పందన రాలేదు. ఇదే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిచ్చగాడు కథానాయకుడు మున్నా కాశీకి స్ఫూర్తిగా నిలిచాడు. స్వతహాగా సంగీత దర్శకుడైన బిచ్చగాడు సినిమా కథానాయకుడైన విజయన్‌లా తాను సైతం కథానాయకుడిగా ఎందుకు ప్రయత్నించకూడదనే స్ఫూర్తి తో ముందుకుసాగాడు. దీంతో తాను రాసుకున్న కథకు ‘హేజా’గా నామకరణం చేసి తానే స్వయంగా చిత్రాన్ని నిర్మించాలని తలపించాడు. దానికి కథానాయకుడిగా, మాటలు, పాటల రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీతదర్శకుడిగా అవతారం ఎత్తాడు కాశీ. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

‘హేజా’ టీజర్ పై ఓ లుక్కేయండి..


1126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles