ఓనం శుభాకాంక్ష‌లు తెలిపిన‌ మెగాస్టార్

Wed,September 11, 2019 11:52 AM
mohanlal onam wishes to audience

మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ ఓ వీడియో ద్వారా ఓనం శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అంద‌రు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. ప్రజలను సమానంగా చూస్తూ, వారు సంతోషంగా ఉండేలా పూర్వం కేరళ రాష్ట్రాన్ని పాలించిన రాజు మహాబలి గౌరవార్థం కేర‌ళ రాష్ట్ర ప్రజలు ప్రతి ఏడాది ఓనం పండుగను ఎంతో ఘ‌నంగా జరుపుకుంటూ ఉంటారు. ప‌లు ప్రాంతాల‌లో ఉండే మ‌ల‌యాళీలు ఓనం రోజున ముంగిళ్లలో ముగ్గులు వేసి వాటిని సుందరంగా అలంకరిస్తారు. పండుగ రోజున‌ మగవారు చొక్కా మరియు ముండు అని పిలవబడే లుంగీ ని ధ‌రిస్తే , స్త్రీలు ముండు మరియు నరియతు అనబడే ఒక బంగారు పైఆచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లలు పావడ మరియు రవికె ధరిస్తారు. ఈ పండుగని కేర‌ళ ఆచార సంప్ర‌దాయాల ప్ర‌కారం ప‌ది రోజుల పాటు జ‌రుపుకుంటారు. అయితే ఈ రోజు ఓనం ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రిటీలు ఓనం విషెస్ తెలిపారు. సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌ని ధ‌రించి వారింట్లో త‌యారు చేసిన స్పెష‌ల్ వంట‌కాల‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
1176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles