సైన్స్ ఫిక్షన్ చిత్రం మ్యాట్రిక్స్ 4 వ‌చ్చేస్తోంది

Wed,August 21, 2019 11:15 AM
Matrix 4 Is Officially Happening

మనుషులు రూపొందించిన రోబోలు భవిష్యత్తులో కృత్రిమ తెలివితో విజృంభించి తిరగబడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో అనేక‌ సినిమాలు వచ్చాయి. దాదాపు మ్యాట్రిక్స్‌ కథ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. భవిష్యత్తులో రోబోలు మనుషులపై యుద్ధం ప్రకటిస్తే, మనుషులంతా కలిసి వాటికి అత్యంత అవసరమైన సోలార్‌ ఎనర్జీని అందకుండా చేస్తారు. కానీ అవి మనుషుల శరీరంలో ఉండే బయో ఎలక్ట్రిక్‌ పవర్‌నే ఉపయోగించుకుంటూ మనుషుల మైండ్స్‌ను వశపరుచుకుంటాయి. అలా వశపరుచుకున్న మనుషులతోనే ‘మ్యాట్రిక్స్‌’ అనే కొత్త ‘సిమ్యుటేటెడ్‌ రియాలిటీ ప్రపంచాన్ని’ సృష్టిస్తాయి. అంటే అక్కడ మనుషులే రోబోలకు రోబోలుగా మారిపోయారన్నమాట. అలా రోబోలకు వశమైపోయి అవి చెప్పినట్టు చేసే మానవ రోబోలను తిరిగి మామూలు మనుషులుగా చేయడానికి కొందరు ప్రయత్నాలు మొదలెడతారు. వారి ప్రయత్నాలేంటి, రోబోలు వాళ్లని ఎలా ఎదుర్కొన్నాయి, మనుషుల మధ్య, మానవ రోబోల మధ్య పోరాటాలు ఎలా సాగాయనేదే ‘ద మ్యాట్రిక్స్‌’ సినిమా కథ.

20 ఏళ్ల క్రితం అంటే మార్చి 31, 1999లో విడుద‌లైన ద మ్యాట్రిక్స్ అనే చిత్రం ప్రేక్ష‌కుల‌ని స‌రికొత్త సైన్స్‌ఫిక్ష‌న్ ప్ర‌పంచంలోకి తీసుకెళ్ళింది. 63 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో రూపొందిన ఈ చిత్రం ఏకంగా 463 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి నాలుగు ఆస్కార్‌ అవార్డులతో పాటు బాఫ్టా, శాటర్న్‌ లాంటి అనేక పురస్కారాలు, ప్రశంసలు అందుకుంది. దీనికి కొనసాగింపుగా ‘ద మ్యాట్రిక్స్‌ రీలోడెడ్‌’, ‘ద మ్యాట్రిక్స్‌ రివల్యూషన్స్‌’ సినిమాలు కూడా వచ్చాయి. ఇక తాజాగా మ్యాట్రిక్స్ 4 చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్

కీను రీవ్స్ మరియు క్యారీ-అన్నే మోస్.. మ్యాట్రిక్స్ 4 లో వారి పాత్రలను పునరావృతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, లానా వాచోవ్స్కీ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించ‌డంతో పాటు ర‌చ‌యితగా, నిర్మాత‌గా పని చేస్తున్నారు . వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ మరియు విలేజ్ రోడ్‌షో పిక్చర్స్ మ్యాట్రిక్స్ 4 ను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉంది. 2020లో ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles