మాజీ మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ప్రియాంక చోప్రా, ఐశ్వర్యరాయ్ ఇప్పుడు వెండితెర స్టార్స్ మారిన సంగతి తెలసిందే. ఇప్పుడు మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ కూడా అతి త్వరలో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఖిలాడీ కుమార్ అక్షయ్ తన తాజా చిత్రంగా పృథ్వీరాజ్ అనే చారిత్రాత్మక చిత్రం చేస్తున్నారు. ఇందులో చక్రవర్తి ప్రేమికురాలు రాణి సంయోగితగా ఆమె కనిపించనున్నారు.చంద్రప్రకాశ్ ద్వివేది చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సంయోగిత పాత్ర కోసం ఎంతో మందిని వెతికి చివరికి మానుషి కరెక్ట్ అని తెలిసి ఆమెని ఎంపిక చేశామని అన్నారు. చారిత్రక చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు మానుషి. 2017లో మానుషి ప్రపంచ సుందరి కిరీటం సాధించిన విషయం తెలిసిందే .పృథ్వీరాజ్ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది.