ఇద్ద‌రి మ‌ధ్య తేడా ఒక్క‌టే.. చూసే దృష్టి అంటున్న మ‌నోజ్

Sat,August 19, 2017 12:14 PM

మంచు వార‌బ్బాయి మ‌నోజ్ ఎల్‌.టి.టి.ఇ. నాయ‌కుడు ప్ర‌భాక‌ర‌న్ గా న‌టించిన‌ చిత్రం ఒక్క‌డు మిగిలాడు. త‌మిళంలో 'నా తిరుంబి వరువేన్' (నేను మళ్లీ తిరిగొస్తాను) టైటిల్ తో ఈ మూవీ విడుద‌ల కానుంది. సెప్టెంబ‌ర్ 8న విడుద‌ల కానున్న ఈ మూవీ ట్రైల‌ర్ ని తాజాగా విడుద‌ల చేశారు. 'ప్రపంచదేశాలు మనల్ని తీవ్రవాదులు అంటున్నాయి. స్వేచ్చ కోసం సాయుధ పోరాటం తీవ్రవాదమైతే.. మనం తీవ్రవాదులమే అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అజ‌య్ ఆండ్రూస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మ‌నోజ్ రెండు పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. శ్రీలంక‌లోని 15 ల‌క్ష‌ల మంది శ‌ర‌ణార్థుల కోసం 1990లో జ‌రిగిన యుద్ధ నేప‌థ్యంలో మూవీ సాగుతుంది . మంచు మ‌నోజ్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ లో స్వాతంత్య్ర‌ సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి అని కామెంట్ పెట్టి ట్రైల‌ర్ ని పోస్ట్ చేశారు. ఈ ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మ‌రి ఆ ట్రైల‌ర్ పై మీరు ఓ లుక్కేయండి.1144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles