నేను మ‌ళ్ళీ తిరిగొస్తానంటున్న మ‌నోజ్

Fri,August 18, 2017 06:24 PM

తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న మంచు మనోజ్ మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. ఇటీవల ఈ హీరోకి సరైన సక్సెస్ లు రాకపోవడంతో ఆచితూచి అడుగులేస్తున్నాడు. మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీలు సెలక్ట్ చేసుకుంటూ శరవేగంగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఒక్కడు మిగిలాడు అనే చిత్రాన్ని చేస్తున్న ఈ హీరో ఎల్‌.టి.టి.ఇ. నాయ‌కుడు ప్ర‌భాక‌ర‌న్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌న‌ప‌డబోతున్నాడు. అజ‌య్ అండ్ర్యూస్ నౌతాక్కి ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన‌ ఈ చిత్రం శ్రీలంక‌లోని 15 ల‌క్ష‌ల మంది శ‌ర‌ణార్థుల కోసం 1990లో జ‌రిగిన యుద్ధ నేప‌థ్యంలో సాగుతుంది. మ‌నోజ్ ఇంటెన్స్ తో కూడిన యాక్ష‌న్‌, డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయనే భావంతో యూనిట్ ఉండగా, సెప్టెంబ‌ర్ 8న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. అయితే ఈ చిత్ర క‌థ ఎల్‌.టి.టి.ఇ. నాయ‌కుడు ప్ర‌భాక‌ర‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌డంతో పాటు ద‌ర్శ‌కుడికి త‌మిళంలో మంచి క్రేజ్ ఉండ‌డంతో మ‌నోజ్ మూవీని త‌మిళంలో 'నా తిరుంబి వరువేన్' (నేను మళ్లీ తిరిగొస్తాను) టైటిల్ తో విడుద‌ల చేస్తున్నార‌ట‌. ఈ చిత్రం శ్రీలంకలో త‌మిళుల పోరాటానికి సంబంధించిన‌ది కాబ‌ట్టి త‌మీళియ‌న్స్ కి ఈ చిత్రం ఈజీగా క‌నెక్ట్ అవుతుంద‌ని అంటున్నారు. రేపు ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

1870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles