మ‌హేష్- వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం..!

Thu,December 5, 2019 01:43 PM

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, క్రియేటివ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మ‌హ‌ర్షి చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. సామాజిక అంశాల‌ని జోడించి క‌మ‌ర్షియ‌ల్ నేప‌థ్యంలో మ‌హ‌ర్షి చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఈ చిత్రానికి భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. క‌ట్ చేస్తే గ‌త కొద్ది రోజులుగా మ‌హ‌ర్షి కాంబినేష‌న్ మ‌ళ్ళీ రిపీట్ కానుంద‌ని సోష‌ల్ మీడియాలో జ‌రుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై వంశీ పైడిప‌ల్లి తాజాగా స్పందించారు. మ‌హేష్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ప్ర‌స్తుతం లొకేష‌న్ వేట‌లో ఉన్నాడ‌ట‌. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు సరిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ చిత్రం జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంది. అనీల్ రావిపూడి చిత్రాన్నితెర‌కెక్కిస్తున్నాడు.

2075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles