మ్యాడ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన నిహారిక‌

Wed,September 18, 2019 11:31 AM

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక తొలిసారి ముద్ద‌పప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించగా, త‌న తండ్రితో క‌లిసి పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బేన‌ర్‌పై నాన్న కూచి అనే వెబ్ సిరీస్ చేసింది. ఇక తాజాగా మ‌రో వెబ్ సిరీస్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. మ్యాడ్ హౌజ్ పేరుతో రూపొంద‌నున్న ఈ వెబ్ సిరీస్ మంచి కంటెంట్‌తో రూపొందుతుంది. ఇది మీ అంద‌రికి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌ని నిహారిక చెప్పుకొచ్చింది. అమృతం సీరియ‌ల్‌లా ఇది కూడా ఫుల్ కామెడీగా ఉంటుందట‌. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో రకంగా కథ‌ ఉండబోతుందని, 100 ఎపిసోడ్ ల వరకు ఈ వెబ్ సిరీస్ ప్ర‌సారం కానుంద‌ని నిహారిక చెప్పుకొచ్చింది. కాగా నిహారిక ఒక మ‌న‌సు, హ్యాపీ వెడ్డింగ్‌, సూర్య‌కాంతం వంటి చిత్రాల‌తో వెండితెరపై ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయాయి. నిహారిక .. సైరా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 2న చిత్రం విడుద‌ల కానుంది.

2029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles