రాజ‌శేఖ‌ర్ కారులో మ‌ద్యం సీసాలు.. ప్ర‌మాదంపై అనుమానాలు!

Wed,November 13, 2019 12:02 PM

మంగ‌ళ‌వారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుండి ఇంటికి వెళుతుండ‌గా ఔట‌ర్ రింగు రోడ్డు పెద్ద గోల్కొండ అప్పా జంక్ష‌న్ వ‌ద్ద రాజ‌శేఖ‌ర్ కారు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో రాజ‌శేఖ‌ర్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన కొద్ది సేప‌టి త‌ర్వాత సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కారుని సీజ్ చేసి పోలీస్ స్టేష‌న్ కి త‌ర‌లించారు. కారులో మ‌ద్యం సీసాలు ఉండ‌డం వారు గ‌మ‌నించారు. అంతేకాదు ఓఆర్ఆర్‌లో వంద కిలోమీట‌ర్ వేగంతో వెళ్ళాల్సిన కారు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారుపై ఇప్ప‌టికే మూడు ఓవర్ స్పీడ్ చలానాలు కూడా ఉన్నాయట‌. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒకటి, సైబరాబాద్ పరిధిలో రెండు చలానాలు ఉన్నాయి. రూ. 3 వేల జరిమానా పెండింగ్ లో ఉందని పోలీసులు అంటున్నారు . దీనిపై పూర్తి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు

8235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles