ఇండియా ఓడిపోయిందని మా నాన్న ఏడ్చాడు..

Mon,August 19, 2019 07:48 PM
Kousalya Krishnamurthy Official Trailer is out


క్రికెట్ నేపథ్యంలో భీమినేని శ్రీనివాస్ రావు తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కౌసల్యకృష్ణమూర్తి’. ఐశ్వర్యా రాజేశ్ ప్రధాన పాత్రలో నటిస్తోండగా..రాజేంద్రప్రసాద్, ఝాన్సీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

‘ఇండియా ఓడిపోయిందని మా నాన్న ఏడ్చాడు..అందుకని నేను ఇండియా తరపున ఆడి గెలిపించి మా నాన్నను సంతోషపెట్టాలి సర్’ అంటూ సాగే సంభాషణలతో ప్రారంభమయే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. నీ వల్ల కాదని ఎవరైనా అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్లని కాదు..నిన్ను అంటూ శివకార్తికేయన్ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఈ చిత్రంలో శివకార్తికేయన్ కోచ్ గా కనిపించనున్నాడు. ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకురానుంది.

2523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles