నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటా..

Sun,July 21, 2019 04:16 PM
kiara advani wants to get love marriage


భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది హిందీ భామ కైరా అద్వానీ. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా ఫాలోవర్స్ ను మాత్రం అమాంతం పెంచేసుకుంది ఈ బ్యూటీ. ఈ హీరోయిన్ మీడియాతో చేసిన చిట్ చాట్ లో కొన్ని విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంది. ఫిట్ నెస్ విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పిన కైరా..అభిమానుల కు కొన్ని ఫిట్ నెస్ టిప్స్ కూడా చెప్పింది. ఫిట్ గా ఉండాలంటే రోజూ జిమ్ కు వెళ్లాల్సిన అవసరం ఏమి లేదని, కాలినడకే అన్నింటికంటే గొప్ప వ్యాయామమని చెప్పింది.

అంతేకాకుండా కైరా అద్వానీ ప్రేమ, పెళ్లి అంశాలపై కూడా క్లారిటీ ఇచ్చింది. నాకు
ప్రేమంటే చాలా గౌరవముంది. మా అమ్మానాన్నలది ప్రేమ వివాహమే. వారిద్దరి మధ్య అనుబంధం చూస్తుంటే నాకు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. నేను తప్పకుండా ప్రేమించే పెళ్లి చేసుకుంటా. అయితే ఇది ఎపుడనే విషయం మాత్రం చెప్పలేను. ఒకవేళ నేను ప్రేమలో పడితే మాత్రం ఆ విషయం తప్పక మా ఇంట్లో చెబుతానని చెప్పుకొచ్చింది.

2009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles