పెళ్లి వేడుకలో కత్రినా, నోరా, నేహా సందడి..వీడియో

Mon,August 19, 2019 03:47 PM
Katrina, Nora Fatehi, Neha Kakkar mesmerises in Bali wedding


బాలీవుడ్ భామలు కత్రినాకైఫ్, నోరాఫతేహి, సింగర్ నేహా కక్కర్ ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. దివంగత నటి శ్రీదేవి స్నేహితురాలు రాఖీ పంజాబీ కుమారుడు అమృత్ పంజాబీ వివాహ వేడుక ఇండోనేషియాలోని బాలిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కత్రినాకైఫ్ స్టేజీపైకి వచ్చి ఇంట్రడక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత లైలా మే లైలా పాటకు నోరా ఫతేహి స్టెప్పులేసి అందరినీ అలరించింది. మరోవైపు అందాల బ్యూటీ సన్నీలియోని రయీస్ సినిమాలోని రీమిక్స్ పాటకు డ్యాన్స్ చేసి మెస్మరైజ్ చేసింది. నేహా తన పాటలతో ఆహూతులను హుషారెత్తించింది. వెడ్డింగ్ కార్యక్రమంలో సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




2410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles