డిసెంబర్ 6న విడుదల కానున్న ‘90 ఎంఎల్’

Wed,December 4, 2019 09:56 PM


శేఖ‌ర్ రెడ్డి యర్ర డైరెక్షన్ లో కార్తికేయ నటిస్తోన్న చిత్రం 90ఎంఎల్. నేహా సోలంకి హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పాటలకి అనూహ్య స్పందన వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ లభించింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని మార్చారు.

నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ ఈ విషయమై మాట్లాడుతూ.. "90 ఎంఎల్ ను మొదట డిసెంబరు 5న విడుదల చేద్దామనుకున్నాం..కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల తేదీని డిసెంబర్ 6 కు మార్చామని చెప్పారు. పూర్తిగా కొత్త కథ, కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కమెర్షియల్, ఎంటర్ టైనింగ్, ఎమోషనల్ అంశాలతో రాబోతుంది. మా బ్యానర్ కి పేరు తెచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం `ఆర్ ఎక్స్ 100` ని మించిన హిట్ అవుతుందని మా ప్రగాఢ నమ్మకం’ అని చెప్పారు. ఈ సినిమాకు పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, కెమెరా: జె.యువ‌రాజ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌, ఫైట్స్: వెంక‌ట్‌.

653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles