బాల‌చంద‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్

Fri,November 8, 2019 11:27 AM

లెజండ‌రీ ద‌ర్శ‌కుడు బాల చంద‌ర్ 2014లో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 100 సినిమాల‌కి పైగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాల చంద‌ర్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. బాల‌చంద‌ర్‌ని ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌లు త‌మ గురువుగా చెప్పుకుంటారు. అయితే ఈ రోజు చెన్నైలోని రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఆఫీస్ పరిధిలో బాల‌చంద‌ర్‌ విగ్ర‌హాన్ని క‌మ‌ల్, ర‌జ‌నీకాంత్ క‌లిసి ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మంలో ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ.. రాజ‌కీయాల‌లోకి వ‌చ్చిన క‌మ‌ల్ సినిమాని ఏ నాడు మ‌ర‌వ‌లేదు. త‌న ప్ర‌తిభ‌ని చూపిస్తూనే ఉన్నాడు అని చెప్పుకొచ్చారు.


గురువారం లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ల‌తో పాటు 60 ఏళ్ళ‌సినీ ప్ర‌స్థానానికి జ్ఞాప‌కంగా మూడు రోజుల వేడుక నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా క‌మ‌ల్ త‌న తండ్రి శ్రీనివాస‌న్ విగ్రహాన్ని ప‌ర‌మ‌క్కుడిలో ఆవిష్క‌రించారు. నేడు చెన్నైలోత‌న సినీ గురువు కె. బాల‌చంద‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ చేసారు క‌మ‌ల్‌. ప్ర‌స్తుతం క‌మ‌ల్ భార‌తీయుడు 2 చిత్రంతో బిజీగా ఉండ‌గా, ర‌జ‌నీకాంత్ ద‌ర్భార్ చిత్రం చేస్తున్నారు.క‌మ‌ల్ తండ్రి శ్రీనివాస‌న్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles