ప‌ర‌మ‌క్కుడిలో ఘ‌నంగా క‌మ‌ల్ బ‌ర్త్‌డే వేడుక‌లు

Thu,November 7, 2019 01:00 PM

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ పుట్టిన రోజు నేడు కావ‌డంతో ఆయ‌న స్వగ్రామం పర‌మ‌క్కుడికి కుటుంబ స‌భ్యులంతా త‌ర‌లి వెళ్ళారు. అక్క‌డ క‌మ‌ల్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌తో పాటు 60 ఏళ్ళ‌సినీ ప్ర‌స్థానానికి జ్ఞాప‌కంగా మూడు రోజుల వేడుక నిర్వ‌హించ‌నున్నార‌ట‌. అంతేకాక క‌మ‌ల్ త‌న తండ్రి శ్రీనివాస‌న్ విగ్రహాన్ని ప‌ర‌మ‌క్కుడిలో ఆవిష్క‌రించ‌నున్నారు. ఇక న‌వంబ‌ర్ 8న తిరిగి చెన్నైకి రానున్న క‌మ‌ల్ హాస‌న్ త‌న సినీ గురువు కె. బాల‌చంద‌ర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ చేయ‌నున్నారు.


కొద్ది సేప‌టి క్రితం శృతి హాస‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తండ్రికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపింది. హ్యాపీ బ‌ర్త్‌డే బాపూజీ..60 ఏళ్ళ సినిమా జ‌ర్నీ చేసిన మీకు ఈ బ‌ర్త్‌డే ఎంతో ప్ర‌త్యేకం. పుట్టిన రోజు నాడు మ‌న స్వ‌గ్రామానికి వ‌చ్చాం. ఫుల్ వేడుక చేసుకుందాం. మీ జీవితంలో మేము భాగమ్యం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. లవ్‌ యూ లాట్స్‌ పప్పా అంటూ శృతి త‌న తండ్రికి శుభాకాంక్ష‌లు తెలిపారు. క‌మ‌ల్ బ‌ర్త్ వేడుక‌లలో శృతిహాస‌న్, అక్ష‌ర హాస‌న్, చారు హాస‌న్, సుహాసిని, శివాజీ గ‌ణేష‌న్ త‌న‌యుడు ప్ర‌భు పాల్గొన‌నున్నారు. క‌మ‌ల్ ప్ర‌స్తుతం భార‌తీయుడు 2 చిత్రంతో బిజీగా ఉండ‌గా, శృతి హాస‌న్ లాభం, ర‌వితేజ 66వ చిత్రాల‌తో బిజీగా ఉంది.

1744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles