ఆర్ఆర్ఆర్ టీంకి షాక్.. ఎన్టీఆర్ లొకేష‌న్ పిక్ విడుద‌ల‌

Wed,December 11, 2019 11:07 AM

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌న (బాహుబ‌లి) సినిమా రికార్డుల‌ని తానే చెరిపేందుకు గ‌ట్టిగా కృషి చేస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లలో ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. జూలై 30,2020న విడుద‌ల కానున్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో జ‌రుగుతుంది. ఎన్టీఆర్‌పై కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కి రాకుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న రాజ‌మౌళికి షాక్ ఇచ్చారు నెటిజ‌న్స్.


ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ విడుద‌ల చేయ‌మ‌ని అభిమానులు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళిని కోరుతూ వ‌స్తున్నారు. కాని జ‌క్క‌న్న పెండింగ్‌లో పెడుతూ ఉండ‌గా, తాజాగా కొమురం భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ లుక్‌ని రివీల్ చేసి షాక్ ఇచ్చారు నెటిజ‌న్స్. భారీ గెడ్డం, త‌ల‌కి పాగా, న‌ల్ల‌టి దుస్తులు ధ‌రించిన ఎన్టీఆర్ ఊరిని ఉద్దేశించి ఏదో మాట్లాడుతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ సినిమాలో భారీ తారాగ‌ణం న‌టిస్తుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలివీయా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. చర‌ణ్‌తో అలియా జోడీ క‌డుతుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, సముద్ర‌ఖ‌ని ప‌లువురు స్టార్స్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. కీర‌వాణి సంగీత‌మందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చరిత్రలో ఇంత వరకు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే కాల్పనిక కథాంశానికి దేశభక్తి జోడించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.

2645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles