ఇండియ‌న్‌2 లో భార‌తీయుడు గెట‌ప్ చూశారా..!

Fri,November 8, 2019 08:25 AM

దాదాపు 23 ఏళ్ళ క్రితం అంటే 1996లో భారతీయుడు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించారు క‌మ‌ల్ హాస‌న్. ఇందులో సేనాప‌తిగా లంచ‌గొండిత‌నంపై పోరాటం చేస్తారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 చేస్తున్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఇండియ‌న్ 2 సినిమాని తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్ న‌టించ‌నున్నారు . ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్, దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రల‌లో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం . లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. క‌మ‌ల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్రంలో క‌మ‌ల్‌కి సంబంధించి లుక్ విడుద‌ల చేశారు. ఇందులో ఎత్తైన కోట‌పై నిలుచొని ఏదో ఆలోచిస్తున్న‌ట్టుగా ఉన్నారు క‌మ‌ల్. అతి త్వ‌ర‌లోనే చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు.

1726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles