ఇండియ‌న్ 2 ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Thu,August 15, 2019 09:37 AM
indian 2 first look

జీనియ‌స్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌- లోకనాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన భార‌తీయుడు చిత్రం ఎన్ని రికార్డులు తిర‌గ‌రాసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 22 ఏళ్ళ త‌ర్వాత ఈ మూవీకి సీక్వెల్ చేస్తున్నారు. రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమాని ఆగ‌స్ట్ నెలాఖ‌రు నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు స‌మాచారం. తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని ఏక కాలంలో తీయ‌నున్న‌ట్టు టాక్ ఈ చిత్రంలో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్ న‌టించ‌నున్నారు .దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం . శింబు కూడా ముఖ్య పాత్ర చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ రోజు స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్బంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో క‌మ‌ల్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. ‘భారతీయుడు’లో తాను పోషించిన సీబీఐ ఆఫీసర్‌ పాత్రనే సీక్వెల్‌లోనూ నెడుముడి వేణు పోషించనున్నారు. వెన్నెల కిషోర్ కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.

823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles