ప్రియుడితో బ్రేక‌ప్‌.. స్పందించిన ఇలియానా

Sat,November 16, 2019 12:12 PM

గోవా బ్యూటీ ఇలియానా కొన్నాళ్ళుగా లండ‌న్‌కి చెందిన ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోస్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ‌ధ్య ఒక‌రినొక‌రు సోష‌ల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోవ‌డంతో నెటిజ‌న్స్‌లో అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్‌కి బ్రేక్ ప‌డిందా అంటూ చ‌ర్చ‌లు మొద‌లు పెట్టారు నెటిజన్స్‌. ఈ విష‌యంపై ఇలియానా తాజాగా స్పందించింది. రిలేష‌న్ అనేది ఇద్ద‌రి మ‌నుషుల‌కి సంబంధించిన విష‌యం. దీనిపై ఇద్ద‌రిలో ఒక‌రు మాట్లాడినా అది వేరే వారి గురించి మాట్లాడిన‌ట్టు అవుతుంది. వాళ్ళ‌కి వ్య‌క్తిగ‌త జ‌వీతం ఉంటుంది. సోష‌ల్ మీడియాలో నాపై వ‌స్తున్న ట్రోల్స్ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోను. కానీ, నాతో రిలేష‌న్‌లో ఉన్న వ్య‌క్తి నాలా మొండిగా ఉండ‌లేక‌పోవ‌చ్చు. ప్రేమ‌లో విఫ‌ల‌మైనందుకు నాకు ఎలాంటి బాధ లేదు. ఇలాంటి స‌మ‌స్య‌ని ఎదుర్కొన్న‌ప్పుడే కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల విలువ మ‌న‌కు అర్ధ‌మ‌వుతుంది. నా విష‌యంలో అలానే జ‌రిగింది. ఈ స‌మ‌యంలో నాకు మ‌ద్దతుగా నిలిచిన వారంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని ఇలియానా పేర్కొంది. ఈ అమ్మ‌డు న‌టించిన బాలీవుడ్ చిత్రం పాగ‌ల్ పంతీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక తెలుగులో చివ‌రిగా ర‌వితేజ‌తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని అనే చిత్రం చేసింది ఇలియానా. ఈ చిత్రం ఫ్లాప్ కావ‌డంతో అమ్మడికి అవ‌కాశాలు క‌రువ‌య్యాయి.

1847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles