మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌ త‌యారీని చూపించిన సితార‌

Sun,September 1, 2019 08:46 AM
How To Make Eco-Friendly Ganesha

మ‌హేష్ గారాల ప‌ట్టి సితార‌, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి త‌న‌య ఆద్య ఇద్ద‌రు క‌లిసి కొద్ది రోజులుగా యూ ట్యూబ్‌లో సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య‌ సొంతంగా యూట్యూబ్ లో A&S అనే పేరుతో చానల్ స్టార్ట్ చేసిన వారు మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ప‌లు వీడియోలు కూడా షేర్ చేశారు. తాజాగా మ‌ట్టి గ‌ణ‌ప‌తుల‌ని త‌యారు చేయ‌డం ఎలానో వీడియో ద్వారా చూపించారు. మూడు స్టెప్పుల‌లో వినాయ‌కుడిని చేసుకోవ‌చ్చ‌ని వారు వివ‌రించారు. మ‌రి మీరు ఈ వీడియోని చూసి మ‌ట్టిగ‌ణ‌ప‌తుల‌ని త‌యారు చేసుకోండి.

1161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles