హిల్ స్టేషన్‌లో ఫిల్మ్‌సిటీ..బిగ్ బీతో హిమాచల్ సీఎం భేటీ

Mon,December 2, 2019 05:12 PM


మనాలీ: హిల్‌స్టేషన్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న పర్యాటక స్థలాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనాలీ, సిమ్లా, ధరమ్‌శాలాతోపాటు ఎన్నో సహజసిద్ధమైన అందాలు హిల్‌స్టేషన్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో అనేక సినిమా షూటింగులు కూడా జరుగుతుంటాయి. ప్రసిద్ద పర్యాటక కేంద్రంగా ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ ఇవాళ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్‌ను కలిశారు.


బ్రహ్మాస్త్ర సినిమాలో షూటింగ్‌లో భాగంగా అమితాబ్ బచ్చన్ మనాలీకి వెళ్లారు. మనాలీలోని సర్కూట్ హౌస్‌లో బిగ్ బీతో సీఎం జైరాం ఠాకూర్ సుమారు అరగంటపాటు సమావేశమయ్యారు. ఫిల్మ్‌సిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై బిగ్ బీ చర్చించారు. అనంతరం సీఎం జైరాం ఠాకూర్ మాట్లాడుతూ..హిమాచల్ ప్రదేశ్‌లో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఫిల్మ్‌సిటీ ఏర్పాటుపై పలువురు సినీ ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలు, ప్రతిపాదనలు స్వీకరించినట్లు చెప్పారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న బ్రహ్మాస్త్ర చిత్రంలో అమితాబ్, రణ్‌బీర్‌కపూర్, అలియాభట్, అక్కినేనినాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles