బెల్లంకొండ గ‌ణేష్ మూవీ లాంచ్.. హాజరైన ప్ర‌ముఖులు

Sat,October 5, 2019 11:10 AM

సూప‌ర్ హిట్ చిత్రాల‌ని నిర్మించిన బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు సాయి గ‌ణేష్ డెబ్యూ చిత్రం కొద్దిసేప‌టి క్రితం లాంచ్ అయింది. దిల్ రాజు,వివి వినాయ‌క్, సాయి శ్రీనివాస్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.దిల్ రాజు క్లాప్ కొట్ట‌గా, తొలి షాట్ వివి వినాయ‌క్ డైరెక్ట్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రేమ ఇష్క్ కాద‌ల్ ఫేం పవ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది . ప‌క్కా ల‌వ్ స్టోరీగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది.



1865
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles