త‌ప్పు ఒప్పుకున్న మికాసింగ్‌.. నిషేదం ఎత్తివేసిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ

Fri,August 23, 2019 09:09 AM
FWICE forgives mika

భార‌త్ - పాక్ మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న స‌మ‌యంలో ప్ర‌ముఖ గాయ‌కుడు మికా సింగ్ పాక్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది . పాక్‌తో పాటు భారతీయులు కూడా ఆయ‌న‌పై మండిప‌డ్డారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) అతనిపై నిషేధం విధించింది. దేశంలో పాటలు పాడడం, బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సినిమాల్లో నటించడం పైనా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఎఫ్‌డబ్ల్యూఐసీ ఆదేశాలు కూడా జారీచేసింది. అయితే దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన మికాసింగ్ .. ముందుగా ఖరారైన కార్యక్రమం కావడంతో పాకిస్థాన్ లో ప్రదర్శన ఇచ్చానని, తన వల్ల తప్పు జరిగిందని, ఇలాంటి తప్పు భవిష్యత్ లో చేయనని మీకాసింగ్ క్షమాపణలు చెప్పారు.

ఆర్టిక‌ల్ 370కి ర‌ద్దు ముందే పాక్ ప్ర‌ద‌ర్శ‌న‌కి సంబంధించి సంత‌కం చేశాను. వీసా కూడా రావ‌డంతో పాక్‌కి వెళ్లి ప్ర‌ద‌ర్శించాను. నేను చేసింది త‌ప్ప‌ని తెలుసు. మ‌రోసారి ఇలాంటివి జ‌ర‌గ‌నివ్వ‌ను అని మికాసింగ్ వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో అత‌నిపై నిషేదం ఎత్తివేసింది ఎఫ్‌డబ్ల్యూఐసీఈ. మికా సింగ్ యూస్‌లోని ఆరు ప‌ట్ట‌ణాల‌లో జ‌ర‌గ‌నున్న క‌న్స‌ర్ట్స్ కోసం స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి ప్ర‌ద‌ర్శ‌న జ‌ర‌ప‌నున్న సంగ‌తి తెలిసిందే.

1930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles