క‌త్రినా వ‌ర్క‌వుట్స్ చూస్తే నోరెళ్ల‌పెట్టాల్సిందే..!

Thu,December 5, 2019 09:52 AM

మ‌ల్లీశ్వ‌రి, అల్ల‌రి పిడుగు వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన క‌త్రినా కైఫ్ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. చివ‌రిగా భార‌త్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన క‌త్రినా ప్ర‌స్తుతం సూర్య‌వంశీ సినిమాలో అక్ష‌య్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయితే ఫిట్‌నెస్‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టే క‌త్రినా షూటింగ్ లేని స‌మ‌యంలో జిమ్‌లోనే ఎక్కువ‌గా స‌మ‌యం గ‌డుపుతూ ఉంటుంది. తాజాగా త‌న వ‌ర్కవుట్స్‌కి సంబంధించిన ప‌లు వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో కత్రినా ప్రముఖ ట్రైన‌ర్‌ యాస్మిన్ కరాచీవాలా, ఆమె వ్యాయామ భాగస్వామి రెజా కటానితో కలిసి కొన్ని సంక్లిష్టమైన వ‌ర్క‌వుట్స్ చేసింది. వీటిని చూసిన నెటిజ‌న్స్ నోరెళ్ళ‌పెడుతున్నారు. క‌త్రినా గ‌తంలోను త‌న వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన ప‌లు వీడియోలు షేర్ చేసి నెటిజ‌న్స్‌కి మాంచి కిక్ ఇచ్చింది.

1838
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles