సైరా చిత్రంలోని పాత్ర‌ల ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల‌

Wed,August 14, 2019 08:29 AM
first looks of syeraa characters

మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కోసం అభిమానులు వేయి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, చిరంజీవి, కిచ్చా సుదీప్, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తి బాబు, ర‌వి కిష‌న్‌, న‌య‌న‌తార ,త‌మ‌న్నా, నిహారిక చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా, వారి లుక్స్‌కి సంబంధించిన వీడియోని చిత్ర నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసింది. ఇందులో ప్ర‌తి ఒక్క‌రి లుక్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

స్వాతంత్య్ర‌ సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్ర మేకింగ్ వీడియో ఈ రోజు సాయంత్రం 3:45 నిమిషాలకు సైరా మేకింగ్‌ వీడియో విడుదల కానుంది. ఇందులో ప‌లు మేకింగ్ విజువ‌ల్స్ చూపించ‌నున్నారు. చారిత్రాత్మ‌క చిత్రంగా రూపొందిన సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని అక్టోబర్‌ 2న విడుదల చేసేందుకు ప్లాన్‌చేస్తున్నారు. ఈ మూవీ కోసం ప‌లువురు హాలీవుడ్ నిపుణులు కూడా ప‌ని చేశారు.1795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles