‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్ ప్రోమో..వీడియో

Tue,September 17, 2019 06:01 PM

టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం వాల్మీకి. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అలనాటి ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ ‘ఎల్లువొచ్చి గోదారమ్మ' ను రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ ప్రోమోను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. శోభన్ బాబు, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఒరిజినల్ పాటకు ఏ మాత్రం తగ్గకుండా రీమిక్స్ చేసేందుకు ప్రయత్నించాడు దర్శకుడు హరీశ్ శంకర్.


వాల్మీకి చిత్రం సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా వాల్మీకి తెరకెక్కుతోంది.


6385
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles