రవితేజ ‘డిస్కో రాజా’ టీజర్

Mon,January 13, 2020 05:16 PM


రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం డిస్కో రాజా. వీఐ ఆనంద్ దర్శకుడు. ఈ మూవీ టీజర్ 2.0ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సోల్జర్స్ సంవత్సరాలపాటు బాంబింగ్స్ తో, ఫైరింగ్స్ తో యుద్దాలు చేసి..వేటాడే ఇంట్లో ఉంటే సడెన్ గా వచ్చే సైలెన్స్ ఉంటుంది చూడూ అంటూ సాగే సంభాషణలతో టీజర్ షురూ అయింది. రవితేజ టీజర్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తుండగా..బాబీ సింహా చెప్పే డైలాగ్స్ తో సాగే టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎస్‌ థమన్‌ మ్యూజిక్‌డైరెక్టర్‌. వెన్నెల కిశోర్‌, సత్య, అజయ్‌ కీలక పాత్రల్లో నటించారు. బాబీ సింహా విలన్‌గా క‌నిపించ‌నున్నారు.

1196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles