దీపికా వ‌ర్కౌట్స్‌ వీడియోల‌ని చూసి షాక్ అవుతున్న నెటిజ‌న్స్

Tue,September 10, 2019 01:42 PM
Deepika Padukone Will Be Young Forever, Says Her Trainer

ఈ కాలం హీరోయిన్స్ వ‌ర్క‌వుట్స్ విష‌యంలో ఎంత శ్ర‌ద్ధ చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రోజులో స‌గ‌భాగం జిమ్‌కే ప‌రిమిత‌మై శ‌రీరాన్ని చాలా ఫ్లెక్సిబుల్‌గా మార్చుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే (33) జిమ్ ట్రైన‌ర్ యాస్మిన్ క‌రాచీవాలా స‌మ‌క్షంలో చేస్తున్న కొన్ని వీడియోలు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. ఇందులో దీపికా చేస్తున్న వ‌ర్కవుట్స్ నెటిజ‌న్స్ నోరెళ్ళ‌పెట్టేలా చేస్తున్నాయి. దీపిక‌ వెన్నెముక కదలికను చూస్తుంటే, ఆమె ఎప్పటికీ యవ్వనంగా ఉంద‌ని నేను చెప్ప‌గ‌ల‌ను ! ఈ విష‌యాన్ని మేము అంగీక‌రించాము. మీరు కూడా అంగీక‌రిస్తార‌ని అనుకుంటున్నాను అని ఫిట్ నెస్ ట్రైన‌ర్ త‌న కామెంట్ ద్వారా తెలిపాడు. ప్ర‌స్తుతం దీపికా ప‌దుకొణే మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చ‌పాక్ అనే సినిమాలో న‌టిస్తుంది. యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో దీపికా న‌టిస్తుంది. జ‌న‌వ‌రి 10,2020న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రో వైపు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ 83లోను దీపికా న‌టిస్తుంది.

View this post on Instagram

upside down,inside out!!!🤪

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

1374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles