జేమ్స్ బాండ్ 25వ చిత్రానికి టైటిల్ ఫిక్స్

Wed,August 21, 2019 11:48 AM
Daniel Craig returns as James Bond

డెనియ‌ల్ క్రెయిగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘జేమ్స్‌ బాండ్‌’ 25వ సినిమా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్‌ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే ఈ చిత్ర‌ కథ ఉండబోతోందని స‌మాచారం. కొద్ది సేప‌టి క్రితం చిత్ర టైటిల్‌ని బాండ్ చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ‘నో టైమ్‌ టు డై’ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 3, 2020న యూకేలో, ఏప్రిల్‌ 8, 2020న యూఎస్‌లో సినిమా విడుదల కాబోతున్నట్లు స్పష్టం చేసింది. మోట్రో గోల్డెన్‌ మేయర్‌, ఇయోన్ ప్రొడక్షన్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి గ‌తంలో ఈ చిత్ర టైటిల్‌కి సంబంధించి ‘ఏ రీజన్‌ టు డై’ ‘షట్టర్‌ హ్యాండ్‌’, ‘ఎక్లిప్స్‌’ పేర్లు చ‌క్క‌ర్లు కొట్టాయి. ఫైన‌ల్‌గా ‘నో టైమ్‌ టు డై’ అనే పేరు ఫైన‌ల్ చేశారు.

బాండ్ 25 చిత్రానికి ఆ మ‌ధ్య ప‌లు స‌మ‌స్య‌లు త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే . సెట్‌లో ప‌రుగెత్తుతున్న‌ప్పుడు డేనియ‌ల్ కాలు మ‌డత‌ప‌డి కింద ప‌డిపోవ‌డంతో ఆయ‌న చీల‌మండ‌కి గాయం అయింది. దీంతో ఈ మూవీ కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డింది. అదీ కాక‌ సెట్‌లో స్టంట్ స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తుండ‌గా మూడు సార్లు పేలుడు సంభ‌వించింది. దీంతో సెట్‌కి సంబంధించిన ఫ‌ర్నీచ‌ర్ మొత్తం అగ్నికి ఆహుత‌య్యాయి. సెట్ బ‌య‌ట నిల‌బ‌డిన ఓ వ్య‌క్తికి స్వ‌ల్ప గాయాలైన‌ట్టు కూడా తెలుస్తుంది. అప్పుడు కూడా చిత్ర షూటింగ్‌కి కొద్ది రోజుల పాటు బ్రేక్ ప‌డింది.

858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles