డిసెంబ‌ర్‌లో వ‌స్తున్న చుల్‌బుల్ పాండే

Wed,August 21, 2019 01:07 PM
dabaang 3 release on 20 Dec 2019 in Hindi, Telugu, Tamil,  Kannada

బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్, సోనాక్షిసిన్హా కాంబినేషన్‌లో దబాంగ్ 3 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో చుల్‌బుల్ పాండేగా అల‌రించ‌నున్నాడు స‌ల్మాన్‌. అయితే ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు కొద్ది రోజులుగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా స‌ల్మాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా చిత్ర రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాడు. డిసెంబ‌ర్ 20న తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంద‌ని తెలిపారు. కిచ్చా సుదీప్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ద‌బాంగ్ సిరీస్‌లో వ‌చ్చిన రెండు చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ద‌బాంగ్ 3పై కూడా బోలెడ‌న్ని ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. స‌ల్మాన్ చివ‌రిగా భార‌త్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే.

1070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles