బ‌న్నీ మూవీపై ట్వీట్ చేసిన ఫ్రాన్స్ కన్సొలేట్ ట్వీట్

Sat,November 9, 2019 08:54 AM

అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ఫ్రాన్స్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. మాంట్ సెయింట్ మైకేల్ అనే ఓ అందమైన ప్రదేశంలో సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా. పాటను చిత్రీకరించారు. పాట‌లో బ‌న్నీకి సంబంధించిన స్టిల్ విడుద‌ల కాగా, ఇందులో వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో బ‌న్నీ క‌నిపించి అల‌రించాడు. ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ కాగా, ఫోటో ఉన్న‌ ట్వీట్‌ని రీ ట్వీట్ చేసిన కన్సొలేట్ జనరల్ అఫ్ ఫ్రాన్స్, బెంగుళూరు.. మాంట్ సెయింట్ మైకేల్ ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న అల..వైకుంఠపురంలో న్యూ పోస్టర్ చూడండి. అలవైకుంఠపురం చిత్ర‌బృందానికి వీసాలు జారీచేసినందుకు సంతోషిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు. మరి కొద్ది రోజుల‌లో చిత్ర బృందం హైద‌రాబాద్‌కి తిరిగి రానుండ‌గా, కీల‌క షెడ్యూల్ జ‌ర‌ప‌నున్నారు. ట‌బు, సుశాంత్ చిత్రంలో కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.
914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles