యంగ్ హీరో చిత్రానికి క్లాసిక్ టైటిల్‌..!

Fri,September 20, 2019 12:39 PM

2018లో ఛ‌లో చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న నాగ‌శౌర్య ఆ త‌ర్వాత క‌ణం, అమ్మ‌మ్మ‌గారిల్లు, న‌ర్త‌న‌శాల చిత్రాల‌తో ఫ్లాపులు మూట‌గ‌ట్టుకున్నాడు. రీసెంట్‌గా ఓ బేబి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించిన‌ప్ప‌టికి ఆ క్రెడిట్స్ అన్నీ స‌మంత‌కే ద‌క్కాయి. అయితే లేడి డైర‌క్ట‌ర్ ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వంలో నాగ శౌర్య యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని చేనుండ‌గా, ఈ చిత్రానికి మూగ మ‌న‌సులు అనే క్లాసిక్ టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై రూపొంద‌నున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ నుండి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది . వ‌చ్చే ఏడాది మేలో విడుద‌ల కానుంది. చిత్ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

1258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles