ఆది పినిశెట్టి బ‌ర్త్‌డే.. క్లాప్ మూవీ పోస్టర్ విడుద‌ల‌

Sat,December 14, 2019 08:00 AM

హీరోగా, స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌ల‌లో న‌టిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్నారు ఆది పినిశెట్టి. సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం చిత్ర‌లో చర‌ణ్ అన్న‌య్య‌గా న‌టించి విమ‌ర్శ‌ల‌కుల ప్ర‌శంస‌లు పొందాడు ఆది పినిశెట్టి. ప్ర‌స్తుతం నూత‌న ద‌ర్శ‌కుడు పృథ్వి ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ జోన‌ర్ చేస్తున్నాడు ఈ జోన‌ర్‌లో ఆది పినిశెట్టి న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ చిత్రం అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ కాగా, ఇందులో ఆది అథ్లెట్‌గా మారే క్ర‌మంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చూపించ‌నున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.


క్లాప్ అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్స్ విడుద‌ల చేశారు. ఆది బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ఈ పోస్టర్‌లో క్లాప్‌ని పైకెత్తి చూపుతున్న‌ట్టుగా ఉంది. ఈ సినిమాని బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయ‌న్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా, ఇళ‌య‌రాజా సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఆకాంక్ష సింగ్ క‌థానాయికగా న‌టిస్తుంది. క్రిష కురుప్ కీల‌క పాత్ర పోషిస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగ‌గంగా జ‌రుపుకుంటుంది.

791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles